మరాఠా రాజకీయా ల్లో కెసిఆర్ పట్టు నిలుపుకోగలరా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్న కేసీఆర్ ఆ దిశక్ గా ప్రయత్నాలను వేగవంతం చేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకా లో పార్టీ ని విస్తరించిన బారసా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వోటు బ్యాంకు ను పెంచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.

దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లున్నది మహారాష్ట్రలోని( Maharashtra )అందుకే అక్కడి పట్టు నిలుపుకుంటే కేంద్రం లో చక్రం తిప్పడం సులువు అవుతుంది అన్న అంచనాల నడుమ మరాఠా వోటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహాలను పన్నుతున్నారు.

ఇప్పటికే అక్కడ బహిరంగ సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి మోడల్ ను మహారాష్ట్రకు కూడా పరిచయం చేస్తానని చెప్తున్నారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా ఎక్కడా జరగలేదని ఆ అభివృద్ధిని మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని కొత్త హామీలు ఇచ్చారు .

"""/" / తనని ఇక్కడ కు ఎందుకు వస్తున్నావ్? అంటూ కొంతమంది నేతలు నిలదీస్తున్నారని, తెలంగాణ స్థాయిలో ఇక్కడ రైతుబంధు, దళిత బంధు( RYTHU BANDHU ) లాంటి పథకాల అమలు చేస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన చెప్పుకొచ్చారు .

మాటలు చెప్పి రాజకీయం చేయడమే తప్ప అభివృద్ధి చేయడం బాజాపా కు చేతకాదు అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

కృష్ణ గోదావరి నదులు పుట్టిన ఈ రాష్ట్రంలో నీటికి సమస్యఉండటం దౌర్భాగ్యం అన్న ఆయన, ఈ పాపం 70 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ బిజెపి( BJP ) ప్రభుత్వాల అసమర్థత వల్లే అని విమర్శించారు.

అవసరమైన దానికన్నా ఎక్కువ నీరు అందుబాటులో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం 50 టీఎంసీల నీరు వృధాగా పోతుందని దానిని సమర్థవంతంగా ఉపయోగించుకునే నేర్పు ఉన్న ప్రభుత్వాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అని దుయ్యబట్టారు.

తనకు మద్దతు ఇస్తే ప్రతి ఎకరానికి నీరు అందిస్తానని వంద సంవత్సరాలు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా కూడా చీకట్లో బతకాల్సి వస్తుందని ఇక పరిస్థితులు మార్చాల్సిన అవసరం ఉందని ,కేంద్రంలో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తనకు అండగా నిలబడాలని ఆయన ఓటర్లను కోరారు """/" / ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాల వల్ల ప్రజలకు గాని రైతులకు గాని ఏ రకమైన మేలు జరగలేదని అంబేద్కర్లాంటి మహానేత పుట్టిన ఈ రాష్ట్రం ఇంకా ఇలానే ఉండటం చాలా బాధాకరమని మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప పరిస్థితుల్లోమార్పు రాదని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు.

మరి కెసిఆర్ ఏ స్థాయిలో మరొక ఓటర్ల మన్నన పొందుతారో వేచి చూడాలి .

బొప్పాయి తొక్కలతో మెరిసే చర్మం మీ సొంతం.. ఇంతకీ వాటిని ఎలా వాడాలంటే?