బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్..!

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు.

ఈ మేరకు తెలంగాణభవన్ లో సమావేశమైన 38 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేల భేటీ జరిగింది.

కేసీఆర్ ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు.

కాగా మరికాసేపటిలో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన జరిగే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరుకానున్నారు.

వైరల్ వీడియో: ఇంకా మారారా.. ట్రైన్ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చిన మహిళ.. చివరకి..