ఎందుకంటే కేజ్రీవాల్, స్టాలిన్, బిఇజూ జనతాదళ్ సాయం ఇంతవరకు కేసీఆర్‌కు లేదు.ఈ క్రమంలో కేసీఆర్ అనుకున్నది ఎలా సాధిస్థారనే ప్రశ్న తలెత్తక మారదు.
ఇప్పటి వరకు బీజేపీ హవా ఎలా ఉందో భవిష్యత్‌లో యూపీలో అదే హవా కొనసాగడం ఖాయమనిపిస్తోంది.
గతంలో మాదిరిగా ఐదు రాష్ట్రాల ఫలితాలు రాగానే కేసీఆర్ సైలెంట్ అవ్వడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది.
మరి యూపీనే ప్రామాణికంగా తీసుకుంటే బీజేపీ మరోసారి పాగా వేసేందుకు యత్నిస్తోంది.ఇది సత్ఫలితమిస్తే మరి కేసీఆర్ దానికి విభిన్న వాతావరణం సృష్టించడం సాధ్యమవుతుందా ? అంటే కాదనే వాదన వినిపిస్తోంది.
"""/"/
ఇలాంటి విభన్న పరిస్థితుల్లో కొత్తగా పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చి ఏమి చేస్తాడంటూ సొంతపార్టీ గులాబీ దండు గుసగుసలాడుతోంది.
అంతర్గతంగా పార్టీ వ్యవహరాలను ఎప్పటికప్పుడు నివేదించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు.ఈ క్రమంలో కొత్తగా సర్వేలు, వ్యూహాలు చేపడితే ఏవీ.
ఫలించవని మరో వాదన తెరపైకి వస్తోంది.ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ఎన్నికల సలహాదారుగా పీకే వచ్చి కొత్తగా ఏం చేస్తాడు ? అంటూ గులాబిదండు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
అయితే టీఆర్ఎస్‌లో రెండో శ్రేణి నాయకుల కారణంగానే పార్టీలో ఎదుగదల లేదన్న ఆరోపణలొస్తున్నాయి.
దీనికి సంబంధించిన ఆధారాలు సైతం గులాబీ అధిష్టానం వద్ద ఆధారాలు కూడా ఉన్నాయట.
మరి కొత్తగా పీకే వచ్చి ఏం చేస్తాడు ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పీకే చెప్పేదాకా అధినాయకత్వానికి పార్టీ వ్యవహరాలు తెలియకుండా పోతోందా ? అనే ప్రశ్న తలెత్తుతోంది.