కజకిస్థాన్ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్
TeluguStop.com
కజకిస్థాన్‌లోని( Kazakhstan ) ఆక్వావ్ సమీపంలో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్( Azerbaijan Airlines ) విమానం ఘోర ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రమాదం తరువాత విమానం శిథిలాల నుంచి ప్రయాణికులు బయటపడేందుకు చేసిన ఆత్మరక్షణ యత్నాలు వీడియోలో కనపడుతున్నాయి.
దెబ్బతిన్న క్యాబిన్ లోపల రికార్డ్ చేసిన ఈ వీడియోలో ప్రయాణికుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది.
ఎంబ్రేయర్ 190 జెట్‌లో( Embraer190 Flight ) మొత్తం 62 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బందితో అజర్‌బైజాన్ రాజధాని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్( Emergency Landing ) చేస్తుండగా కుప్పకూలింది.సంఘటన తర్వాత విమాన శిథిలాల వద్ద ప్రజలు భయాందోళనలో పరుగులు తీసిన దృశ్యాలు విజువల్స్‌లో చూడవచ్చు.
"""/" /
రష్యా ఏవియేషన్ వాచ్‌డాగ్ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, ఈ ప్రమాదానికి పక్షి ఢీ కావడం ప్రధాన కారణంగా చెబుతున్నారు.
విమానం ఆక్టావ్ విమానాశ్రయానికి దారి మళ్లించినా, ల్యాండింగ్ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.మొత్తం 29 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే వీరిలో పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బతికి బయటపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
విమానంలో ప్రమాద సమయంలో ప్రయాణికుల రోదనలు హృదయవిదారకంగా వినిపించాయి. """/" /
ఈ ఘటన జరిగిన వెంటనే అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ గ్రోజ్నీకి వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.దర్యాప్తు కోసం ప్రత్యేక ప్రభుత్వ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఇక వైరల్ అయినా విమాన శిథిలాల నుంచి బయటపడేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఉన్నాయి.
ఈ ప్రమాదం విమాన సురక్షితతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఈ ప్రమాదం విమానయాన రంగంలో అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.రాబోయే కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మాక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!