కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది అని ఆ కసాయి తల్లి ఏమి చేసిందో తెలుసా
TeluguStop.com
పుట్టిన వెంటనే ఆడపిల్లలను పొట్టనపెట్టుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాము.అయితే పుట్టి 32 ఏళ్లు పెంచిన ఆ తల్లిదండ్రులు ఆ యువతికి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుంది అన్న బెంగ తో ఆ కసాయి తల్లిదండ్రులు ఏకంగా కొడుకు తో కలిసి ఆ యువతిని పొట్టన పెట్టుకోవాలని చూశారు.
ఈ ఘటన నల్గొండ జిల్లా లో చోటుచేసుకుంది.మునుగోడు నియోజకవర్గం వెలగలగూడెం గ్రామంలో బాధితురాలు కవితను ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య కలిసి బండరాళ్లతో తీవ్రంగా కొట్టారు.
ఆమెకు వివాహం చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుందని భావించిన వారు అదే కూతురే లేకపోతే ఈ సమస్యే ఉండదని భావించి కన్న కూతుర్నే చంపేయాలనుకున్నారు.
యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం డాక్టర్లు ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.32 ఏళ్ల కవిత పీజీ చదివింది.
అయితే కొన్నేళ్లుగా ఆమెకు పెళ్లి చేయకుండా కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వస్తున్నారు.
దీనిపై కవిత కూడా తల్లిదండ్రులుగా నా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తో వాళ్లంతా ఆమెపై ఆగ్రహం పెంచుకున్నారు.
ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఏడు ఎకరాల భూమి ఉండగా అందులో తన పెళ్లికి కట్నం కింద 2 ఎకరాల భూమి తన పేరు కు రాయాలని కవిత డిమాండ్ చేస్తుంది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/02/Kavitha-Nalgonda-two-Across-Acres-of-land-కవిత-నల్గొండ!--jpg"/ఈ నేపథ్యంలో పెళ్లికి కట్నం ఇస్తాము గానీ భూమిని మాత్రం నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించం అంటూ పట్టుబట్టిన తల్లిదండ్రులు చివరికి ఆమె ను చంపేందుకు ఫిక్స్ అయ్యి ఇలా దాడికి దిగినట్లు తెలుస్తుంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం కవిత పై దాడికి దిగిన ఆమె తల్లి, అన్నయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
కన్నడ మాట్లాడితే రూ.200 లేదంటే రూ.300.. బెంగళూరు ఆటోడ్రైవర్ల విచిత్ర వైఖరి బట్టబయలు!