ఎట్టకేలకు ఉత్కంఠ పరిణామాల మధ్య నేడు ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడి అధికారుల విచారణకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ హాజరు కాబోతున్నారు.
అయితే ఈ విచారణ పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.విచారణ తరువాత కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇప్పటికే మంత్రి కేటీఆర్(Ktr) ఢిల్లీకి చేరుకున్నారు.రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండబోతున్నారు.
అలాగే కెసిఆర్ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారందరితో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నట్లు సమాచారం.
ఇద్దరూ లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia)తో పాటు, 11 మందిని ఈడి అధికారులు అరెస్ట్ చేశారు.
దీంతో ఈరోజు విచారణ ముగిసిన అనంతరం కవితను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
"""/" /
ఇప్పటికే ఈ కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త , కవితకు సన్నిహితుడుగా పేరుపొందిన అరుణ్ రామచంద్ర పిళ్ళై(Arun Ramachandra Pillai ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా రామచంద్ర పిళ్లై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఈడి అధికారులు ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే కవిత వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. """/" /
కేంద్ర అధికార పార్టీ బిజెపి వేధింపులకు పాల్పడుతోందని, దీనిలో భాగంగానే కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి ఇష్టం సారంగా వాడుకుంటూ.
బీజేపీ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.మొత్తంగా ఈ వ్యవహారంలో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కేసీఆర్ కూడా అంచనా వేస్తున్నారు.
అందుకే హుటాహుటిన కేటీఆర్ ను ఢిల్లీకి పంపించి, వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేస్తే .
దానిని రాజకీయంగాను ఉపయోగించుకునేందుకు, ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ ఆయిల్ ను వాడండి!