లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఈ కేసు కేసీఆర్‌కు అస్త్రంగా మారనుందా?

సీబీఐ, ఈడీలు  టీఆర్‌ఎస్ నేతలను ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేశారు.  ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చింది.

ఇది అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.   ఈ కేసులో కవిత అరెస్ట్ కానునున్నారనే  వార్తలు కూడా వినిపించాయి .

అయితే, ఈ పరిణామం రాష్ట్ర  బిజెపికి రాజకీయంగా అడ్డంకిగా మారుతుందని కొందరూ బీజేపీ నాయకులు భావిస్తున్నారు .

కేసీఆర్‌ ప్రజల్లో కొంత వ్యతిరేకత వినిపిస్తున్న మాట వాస్తవమే కానీ అది బీజేపీకి లభించేంతలా లేదని  వారు అభిప్రాయపడుతున్నారు.

ఒక్కవేళ కవితను అరెస్ట్ చేస్తే.ఇది టీఆర్‌ఎస్‌కు సానుభూతి తెచ్చిపెట్టవచ్చని ఇది సాధరణ  ఎన్నికల్లోఆ పార్టీకి  సహాయపడవచ్చని వారు భావిస్తున్నారు.

అధికార  పార్టీపై వ్యతిరేకత గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వ్యూహాలు పని చేస్తాయి.

టీఆర్‌ఎస్‌‌పై అంత పెద్దగా వ్యతిరేకత ఇంకా రాలేదు.   దర్యాప్తు ఏజెన్సీలు చేసే ప్రతి ప్రయాత్నాన్ని వేధింపుల ప్లాంక్‌ను టీఆర్‌ఎస్  ఉపయోగించుకుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు.

సాధరణంగా రాజకీయల్లో అపార చాణిక్యుడైన  కేసీఆర్ కంటే 'సానుభూతి' ప్లాంక్‌ను వాడుకోవడంలో ఆయనకు మించనవారు ఎవరూ లేరని అంటున్నారు .

అయితే ఈ విషయంలో కవిత  నుండి కాకుండా పార్టీలోని ముఖ్యమైన నేతలను టార్గెట్ చేస్తే బీజేపీ టీఆర్‌ఎస్‌ ప్రాబల్యాన్ని తగ్గించవచ్చని బీజేపీ నాయకులు అంటున్నారు.

/br """/"/ ఇక ఈ కేసు విషయంలో స్పందంచిన కవిత, రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నంత వరకు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు.

 "వాళ్ళు ఏం చేయగలరు? కనీసం నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అయితే ప్రజలు టీఆర్‌ఎస్‌తో ఉన్నంత కాలం ఇలాంటి అరెస్టులు, ఆరోపణలకు భయపడాల్సిన అవసరం లేదు.

 టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాం అంటూ వ్యాఖ్యనించారు.

పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..