కౌశిక్ ఎమ్మెల్సీ అయ్యేనా ? కనికరించంది ఎవరు ?
TeluguStop.com
టిఆర్ఎస్ యువనేత కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు చెందిన కౌశిక్ ను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
అంతకుముందు ఆయన టిఆర్ఎస్ తరఫున హుజురాబాద్ ఎన్నికలలో పోటీకి దిగుతున్నారనే ప్రచారం జరిగింది.
దీనికి సంబంధించిన ఆడియో బయటకు లీక్ కావడం పెద్ద దుమారమే రేపింది.చివరకు ఆ పరిణామాలతో కౌశిక్ రెడ్డి అభ్యర్థిగా కాకుండా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టే విధంగా రాజకీయం నడిపించాలని టిఆర్ఎస్ పెద్దలు భావించారు.
ఇక వెంటనే ఆయనను ఎమ్మెల్సీ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు .ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ సైతం దీనికి ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన ఫైలు కూడా గవర్నర్ కార్యాలయానికి వెళ్లి రెండు వారాలు దాటుతున్నా, ఇప్పటికీ కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీ గా ప్రకటిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అసలు కొత్తగా వచ్చిన కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఇస్తుండడం పై టిఆర్ఎస్ లో పెద్ద దుమారమే రేగింది.
ఎప్పటి నుంచో పదవుల కోసం ఆశలు పెట్టుకున్న తమను కాదని, కొత్తగా వచ్చిన కౌశిక్ కు అప్పగించడంతో కొంతమంది అలక చెందారు.
అయినా కేసీఆర్ మాత్రం ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినట్ చేస్తూ క్యాబినెట్ ద్వారా ఆమోదం తెలిపారు.
కౌశిక్ ఎమ్మెల్సీ ని చేసి హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని భావించినా, ఇప్పటికీ దానికి సంబంధించిన వ్యవహారం ఎటు తేలకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
"""/"/
అసలు నిజంగానే ఆ ఫైలును గవర్నర్ కార్యాలయానికి పంపించారా ? సీఎంవో లేనే పెండింగ్ లో పెట్టారా ? గవర్నర్ కార్యాలయానికి వెళ్లి ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? ఇలా అనేక అనుమానాలెన్నో తెరపైకి వస్తున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపులో కౌశిక్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ వస్తే కేసీఆర్ ఆశించినట్లుగా హుజురాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు కాస్త సానుకూలత ఉంటుంది.
కౌశిక్ రెడ్డి కూడా మరింత యాక్టివ్ గా పనిచేసేందుకు అవకాశం కలుగుతుంది.టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగే విధంగా కౌశిక్ ను ఎమ్మెల్సీ చేసే ప్రక్రియను తెర వెనుక బీజేపీ అడ్డుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.
స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?