కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో డైల‌మాలో ప‌డ్డ కౌశిక్‌.. టికెట్ డౌటేనా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు.ఊహ‌కు కూడా అంద‌ని విధంగా ఉంటాయి రాజ‌కీయాలు.

ఇప్పుడు హుజూరాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న రాజ‌కీయాలు నిజ‌గా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.కాగా ఇక్క‌డ మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ కు గ‌ట్టి పోటీ ఇస్తాడ‌నుకున్న కౌశిక్ రెడ్డి అనూమ్యంగా ఆయ‌న కాల్ వాయిస్‌లు లీక్ కావ‌డం, అందులో ఆయ‌న‌కు టీఆర్ ఎస్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు మాట్లాడ‌టంతో ఆయ‌న‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ అయింది.

దీంతో ఆయ‌న కూడా నిర్మొహ‌మాటంగా ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.ఇక ఎన్నో అనుమానాల త‌ర్వాత ఆయ‌న టీఆర్ ఎ స్‌లో చేరారు.

అయితే ఆయ‌న చేరిక‌కు ఏకంగా సీఎం కేసీఆర్ రావ‌డంతో అంతా ఆయ‌న‌కు ఇంపార్టెన్స్ టీఆర్ ఎస్‌లో పెరుగుతుంద‌ని భావించారు.

కాగా ఆయ‌న‌కు అనూమ్యంగా కేసీఆర్ మాట‌లు షాక్ ఇచ్చాయ‌నే చెప్పాలి.కౌశిక్ చేరిక సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌కీయ పార్టీలో ప‌దువులు శాశ్వ‌తం కాద‌ని, ప‌ద‌వి లేక‌పోయినా పార్టీలో ఉంటే అదే పెద్ద ప‌వ‌ర్ అంటూ మాట్లాడ‌టంతో కౌశిక్ అభిమానులు అంతా షాక్ అయ్యారు.

"""/"/ చేరిన మొద‌టి రోజే అలా అన‌డంతో అస‌లు పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మ‌న‌సులో వేరే వ్య‌క్తులు కూడా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వేరే వ్య‌క్తిని నిల‌బెడితే ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కౌశిక్‌ను వాడుకుంటున్న‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది.

మొన్న‌టి నుంచి ఆర్‌.ఎస్‌.

ప్ర‌వీణ్ కుమార్ పేరు కూడా చాలా బ‌లంగా వినిపిస్తుండ‌టంతో కేసీఆర్ వ్యాఖ్య‌లు పెద్ద అనుమానం పెంచేశాయి.

మ‌రి కేసీఆర్ ఏ చేస్తారు కౌశిక్‌కు టికెట్ ఇస్తారా లేక వేరే వ్య‌క్తికి ఇస్తారా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఏంటీ.. కొబ్బ‌రి పువ్వు తిన‌డం వ‌ల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా?