అలాంటి పాత్రలలో నటించాలని చాలా ఇష్టంగా ఉంది: కత్రినా కైఫ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కత్రినా కైఫ్ ( Katrina Kaif ) ఒకరు.

ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు.అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి కత్రినా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలోని నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇక పెళ్లి తర్వాత కూడా కత్రినా వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్( Director Sriram Raghavan ) దర్శకత్వంలో నటించిన మేరీ క్రిస్మస్(Merry Christmas) అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

"""/"/ ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటుడు విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) నటించారు.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పరిష్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు సినీ సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో కత్రినా కైఫ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన మనసులో మాటలను కూడా బయటపెట్టారు. """/"/ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పుడూ ఒకే తరహా సినిమాలో కాకుండా అప్పుడప్పుడు తమ అభిరుచులను కూడా మార్చుకుంటూ విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే కత్రినా కూడా తనకు హీరోయిన్ గా అన్ని రకాల పాత్రలలో నటించాలని ఉందని ఈమె తెలిపారు.

ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ( Negative Shades ) ఉన్న పాత్రలలోనూ పిరియాడిక్ సినిమాలలో నటించాలని చాలా కోరికగా ఉందని ఇలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా కత్రినా కైఫ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది.. సంక్రాంతికి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?