Kaatera : సలార్ స్పీడ్ కు బ్రేకులు.. ఆ రాష్ట్రంలో సలార్ ను మించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న చిన్న సినిమా ఇదే!

కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Nee ) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడం తో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

కాగా ప్రస్తుతం ఈ సినిమా 600 కోట్లకు చేరువలో ఉంది.లాంగ్ రన్ లో మరొక 100 కోట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక ప్రదేశంలో సలార్ సినిమాకు షాక్ ఇస్తూ ఒక ప్రాంతీయ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.

"""/" / దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటకలో సలార్ కి వసూళ్లు ఒక మాదిరిగానే వచ్చాయి.ఇప్పటివరకు రూ.

35.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది.

అదే టైంలో రీసెంట్‌గా డిసెంబరు 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ కాటేరా( Kaatera ) విడుదల అయ్యింది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో రెండు రోజుల్లోనే రూ.

37 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.మిగతా చోట్ల సలార్ వసూళ్ల మేనియా గట్టిగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది.

ఈ కారణంగానే కాటేరా కు ప్లస్ అయింది.</br """/" / అలా కాకుంటే మాత్రం ప్రభాస్ సినిమా ముందు దర్శన్ అస్సలు నిలబడలేకపోయేవాడు.

సలార్ కంటే రెండు కోట్లు ఎక్కువగానే కలెక్షన్స్ సాధించి సలార్ కి షాక్ ఇచ్చింది కాటేరా మూవీ.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే సలార్ విషయానికి వస్తే.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

అలాగే ఇందులో యాంకర్ ఝాన్సీ, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్, జగపతిబాబు లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

డైరెక్టర్ ని చూడటానికి వెళ్లి హీరోయిన్ గా అయిపోయింది … ఎలాగో తెలుసా?