గంటకు 5 వేలు ఇస్తారు కదా అన్న నెటిజన్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కస్తూరి శంకర్?

అన్నమయ్య సినిమాలో నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి కస్తూరి శంకర్( Kasturi Shankar ) గురించి మనకు చెప్పాల్సిన పనిలేదు.

అయితే ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ అలాగే పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు అంశాల గురించి ఈమె స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే తాజాగా తమిళంలో ప్రారంభమైనటువంటి బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం గురించి ఈమె మాట్లాడారు.

"""/" / ఈ కార్యక్రమంలోకి తమిళ పాపులర్ నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ ( Jovika Vijayakumar ) ఎంట్రీ ఇచ్చింది.

ఇదివరకు తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో వనిత విజయ్ కుమార్‌తో పాటు కస్తూరి శంకర్ కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఇక జోవిక ఈ కార్యక్రమంలో పాల్గొనడం గురించి కస్తూరి శంకర్ అభిప్రాయం గురించి నేటిజన్స్ అడగడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంట్లో చాలా మందిని ఉంచి వారి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ చూపే షోను నేను పట్టించుకోను.

నా దగ్గర టీవీ లేదు.నాకంతా టైమ్, ఓపిక, ఇంట్రెస్ట్ లేవు.

"""/" / నాకు కుటుంబం, దాని బాధ్యతలు, వర్క్ ఉన్నాయి.నేను బిగ్ బాస్ చూడటం లేదని కస్తూరి శంకర్ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‍ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.ఒకప్పుడు బిగ్ బాస్ కార్యక్రమం( Bigg Boss Programme )లో పాల్గొన్నటువంటి మీరు ఇలా ఈ కార్యక్రమం గురించి మాట్లాడటం ఏమాత్రం బాగాలేదు అయినా అప్పుడు డబ్బు కోసమే ఈ కార్యక్రమంలోకి వెళ్లారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరొక నెటిజన్ అయితే దారణంగా అవునులే నీకు గంటకు 5000 వస్తాయి కదా అంటూ మరో అర్థం వచ్చేలా కామెంట్ చేశారు.

దీంతో మండి పడినటువంటి కస్తూరి శంకర్ మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగే పెంచారా.

నిన్ను చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)