ఓటు వేయని జ్యోతిక… ఏకిపారేసిన నటి కస్తూరి శంకర్?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి జ్యోతిక ( Jyothika ) సాధారణంగా ఎలాంటి కాంట్రవర్సీలలో నిలవదు.

ఆమె సినిమా పనులు కుటుంబ బాధ్యతలు తప్ప బయట విషయాల గురించి అసలు ప్రస్తావనకు కూడా తీసుకురాదు.

కానీ ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓటు వేయడం గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదంలోకి నెట్టివేశాయి.

ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సెలబ్రిటీలు అందరూ కూడా తరలివచ్చి ఓటు వేశారు.

"""/" / ఇక సూర్య, కార్తీ ఇద్దరు కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇలా స్టార్స్ అందరూ కూడా ఓటు వేసి అందరికీ పూర్తిగా నిలిచారు.కానీ నటి జ్యోతిక మాత్రం ఓటు హక్కును ( Casting Vote ) వినియోగించుకోలేదు ఇదే విషయం గురించి ఓ రిపోర్టర్ ఎందుకు ఓటు వేయలేదు అంటూ ఏమైనా ప్రశ్నించారు నేను ఆన్లైన్లో కూడా కొన్నిసార్లు ఓటు వేశానని అలాగే ప్రతిసారి తాను ఓటు వేస్తూనే ఉన్నానని కొన్నిసార్లు ఓటు వేయటానికి అందుబాటులో లేకుండా ఇతర ప్రాంతాలలో ఉండటం వల్ల ఓటు వేయలేక పోతామని తెలిపారు.

"""/" / ఇలా తమకంటూ కొంచెం ప్రైవేట్ లైఫ్ ఉంటుంది వాటి పనులలో బిజీగా ఉండి ఓటు వేయలేకపోయాను అంటూ ఈమె సమాధానం చెప్పుకొచ్చారు.

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ కూడా కామెంట్లో చేస్తున్నారు ఓటు ఆన్లైన్ లో వేయడం ఎప్పుడూ చూడలేదు అంటూ కొందరు కామెంట్లో చేయగా మరికొందరు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఎన్ని పనులు ఉన్నా ఓటు వినియోగించుకోవడం మన హక్కు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

ఇక ఈ విషయంపై నటి కస్తూరి శంకర్ ( Kasturi Shankar ) కూడా స్పందించారు.

మాలాంటి వారందరూ రోజంతా ఎండలో నిలబడి ఓట్లు వేశాము అమెరికా ఫ్లైట్ టికెట్ బుక్స్ చేసుకున్న క్యాన్సిల్ చేసుకుని మరి ఓట్లు వేసాము అంటూ కస్తూరి శంకర్ కూడా జ్యోతికకు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓట్స్, బీట్ రూట్.. స్కిన్ విషయంలో ఈ కాంబినేషన్ చేసే మ్యాజిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!