జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన నటుడు కార్తికేయ..

భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు సుచిత్ర సర్కిల్ లో గల వెంకటేశ్వర ఎన్కేవ్ లో ఏర్పాటైన "జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్" ను టాలీవుడ్ నటుడు కార్తికేయతో పాటు బిగ్ బాస్ ఫేం మహబూబ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంలో నటుడు కార్తికేయ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు.

బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు నవాబ్ థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చెయడం అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి త్వరలో చందానగర్ లో కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఈ మండి జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు.

ప్రాంఛైజీ నిర్వహకులు ఒకరు మాట్లాడతూ నవాబ్ మరియు జైల్ థీమ్ తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు.

హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!