అల వైకుంఠపురంలో సినిమాపై మనసు పడిన బాలీవుడ్ కుర్ర హీరో
TeluguStop.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో.
ఈ సినిమా బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.
అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఇందులో హీరోగా కుర్ర హీరోలలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.ఎక్కువగా షాహిద్ కపూర్ పేరు వినిపిస్తుంది.
అయితే ఒక కుర్ర హీరో మాత్రం అల సినిమాపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాడు.
ఈ రీమేక్ ను నేనే చేస్తేనే కరెక్ట్ అని అంటున్నాడు.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైనర్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన నటుడు కార్తీక్ ఆర్యన్.
తాజాగా ఆయన అల వైకుంఠ పురంలో సినిమాపై ఆసక్తి చూపిస్తున్న విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు.
నెట్ ఫ్లిక్స్ లో నేను అల వైకుంఠపురములో’ చిత్రం చూసాను.ఆ చిత్రం చూశాక హిందీ రీమేక్ లో ఎట్టి పరిస్థితుల్లో నేనే నటించాలని ఫిక్స్ అయిపోయాను.
అల్లు అర్జున్ పాత్రలో నన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను అంటూ కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.
దర్శకుడు రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది.
అయితే ఈ రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే నిర్మాత, దర్శకుడుతో కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది.
మరి వాళ్ళు అల కోసం కార్తీక్ ని తీసుకుంటారా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట