జ్యోతికను అమ్మగానే చూశానన్న కార్తీ.. సూర్య జ్యోతిక వేరు కాపురం అందుకేనంటూ?

గత కొంతకాలంగా సూర్య జ్యోతిక( Surya , Jyotika ) వేరు కాపురం గురించి ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో సూర్య జ్యోతిక క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకోగా సూర్య వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల విజయాలతో మార్కెట్ ను పెంచుకున్న సూర్య ప్రస్తుతం కంగువా అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.

సూర్య బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

స్కంద మూవీ( Skanda Movie ) విడుదలైన తర్వాత సూర్య బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సూర్య సోదరుడైన కార్తీ తాజాగా జ్యోతిక గురించి సూర్య జ్యోతిక వేరు కాపురం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / కార్తీ మాట్లాడుతూ జ్యోతికను నేను ఎప్పుడూ నటిగా చూడలేదని కామెంట్లు చేశారు.

నేను ఆమెను అమ్మగా మాత్రమే చూశానని పేర్కొన్నారు.జ్యోతిక కూడా మమ్మల్ని పిల్లల్లా చూసిందని సూర్య చెప్పుకొచ్చారు.

అమ్మ ప్రస్తుతం ముంబైలో( Mumbai ) ఉండటంతో మా ఇల్లు బోసిపోయిందని కార్తీ కామెంట్లు చేశారు.

అమ్మతో కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నామని కార్తీ తెలిపారు. """/" / ఇన్ని సంవత్సరాల పాటు తామందరం కలిసి ఉన్నామంటే కారణం జ్యోతికనే అని కార్తీ కామెంట్లు చేశారు.

అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతుండటంతో చదువల కోసం వాళ్లు ముంబైకి వెళ్లారని చదువులు పూర్తైన తర్వాత తప్పకుండా కలిసే ఉంటామని ఈలోపు ప్రతి పండుగకు కలుస్తూ ఉంటామని కార్తీ చెప్పారు.

కార్తీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

నా లైఫ్ లో అత్యంత భయానక క్షణాలివే.. మాధవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!