పుష్ప తో కార్తికేయ 2 కి పోలిక.. బాలీవుడ్ లో ఆ ఘనత సాధ్యమేనా?
TeluguStop.com
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ను హిందీ లో విడుదల చేసే ఉద్దేశ్యం ఏమీ లేదు.
కాని ఈ సినిమా లో అనుపమ్ ఖేర్ నటించిన కారనంగా కొన్ని షో లు అక్కడ బాలీవుడ్ వారి కోసం వెయ్యాలని అనుకున్నారట.
కాని సినిమా మొదటి షో తోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.అక్కడ ఏకంగా ప్రస్తుతం రోజుకు ఆరు వందల షో లు పడుతున్నారు.
కొన్ని షో లు అనుకున్నది కాస్త ఇంత భారీగా విడుదల అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో పుష్ప సినిమా కూడా ఇలా చిన్న చిన్నగా బాలీవుడ్ లో వసూళ్ల వేట మొదలు అయ్యింది.
వంద కోట్ల వసూళ్లు ఏమో కానీ అక్కడ పది కోట్లు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా చాలా మంది భావించారు.
కాని అనూహ్యంగా వంద కోట్లకు పైగా వసూళ్లను పుష్ప సినిమా ఉత్తర భారతంలో దక్కించుకున్న విషయం తెల్సిందే.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఉత్తర భారతంలో దక్కించుకున్న పుష్ప తరహా లోనే కార్తికేయ 2 సినిమా కూడా అక్కడ కుమ్మేయడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.
ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప స్థాయి లో కార్తికేయ 2 సినిమా అక్కడ వసూళ్లు సాధించబోతుంది అంటున్నారు.
పుష్ప మాస్ సినిమా కనుక వంద కోట్లు సాధ్యం అయ్యింది.కాని కార్తికేయ 2 సినిమా క్లాస్ సినిమా కనుక అక్కడ పాతిక కోట్ల వరకు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో మరియు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా వంద కోట్ల వరకు వసూళ్లు చేస్తే బాగుంటుంది అంటూ నిఖిల్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి అది ఎంత వరకు సాధ్యం అయ్యేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
18 ఏళ్ల నాటి ఎన్ఆర్ఐ హత్య కేసు .. 10 మందికి జీవిత ఖైదు , గుజరాత్ కోర్ట్ సంచలన తీర్పు