కార్తికేయ 2 ఒక్క రోజు ఆలస్యంతో ఎంత నష్టమో తెలుసా!

నిఖిల్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ 2 ఆగస్టు 13వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ను మొదట ఆగస్టు 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.

అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు, కానీ ఆగస్టు 12వ తారీకున నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దాంతో సినిమా లకు సంబంధించిన పోటీ వద్దు అనే ఉద్దేశం తో రెండు సినిమా లు ఒకే రోజు విడుదల అయితే ఈ రెండు సినిమా లు కూడా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో కార్తికేయ 2 సినిమా ని ఒక రోజు వాయిదా వేసి ఆగస్టు 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.

హీరో నిఖిల్ కు ఇష్టం లేకుండానే సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్లు సమాచారం అందుతోంది.

ఈ సినిమా ను శుక్రవారం కాకుండా శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు నేపథ్యం లో కచ్చితంగా సినిమా కు రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందంటూ సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం సినిమా విడుదలైతే పాజిటివ్ టాక్ వస్తే ఆ రోజు కలెక్షన్స్ బాగుంటాయి.

ఆ తర్వాత శని ఆది వారాలు కనుక మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

శుక్రవారం విడుదల కాక పోవడం వల్ల సినిమాకి చాలా నష్టం వాటిల్లడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలం లో అన్ని సినిమాలు కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి.

అందుకు కారణం శుక్ర వారం మొదటి రోజు కావడం వల్ల భారీ వసూళ్లు నమోదు అవుతాయి.

ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్ అవ్వడం వల్ల మంచి వసూళ్లు వస్తాయి.

అలా మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు అవటం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు.

ఆ లాభాలను కార్తికేయ 2 మిస్‌ కాబోతుంది అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!