Karthika Deepam 2 :కార్తీకదీపం2 సీరియల్ ప్రోమో రిలీజ్.. ఇలాంటి కాన్సెప్ట్ ను మళ్లీ చూస్తారా అంటూ?

స్టార్ మా ఛానల్( Star Maa ) లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రముఖ సెలబ్రిటీలు సైతం వేర్వేరు సందర్భాల్లో ఈ సీరియల్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.

ఈ సీరియల్ కు సంబంధించిన స్పూఫ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.అయితే కార్తీకదీపం సీజన్2( Karthika Deepam 2 ) గురించి కొన్నిరోజుల క్రితం స్టార్ మా ఛానల్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే కార్తీకదీపం2 సీరియల్ ప్రోమో రిలీజ్ అయింది. """/" / ఈ ప్రోమోను చూసిన సీరియల్ ఫ్యాన్స్ రొటీన్ కాన్సెప్ట్ తో కార్తీకదీపం2 తెరకెక్కుతోందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే కార్తీకదీపం క్రేజ్ వల్ల సీజన్2 హిట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సీజన్1 లో ఉన్న పెద్ద పిల్లలు సీజన్2 లో ఒక పాప అయిందని ఇదేం సీరియల్ నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కార్తీకదీపం ఇది నవ వసంతం పేరుతో సీజన్2 తెరకెక్కుతోంది. """/" / కార్తీకదీపం కాన్సెప్ట్( Karthika Deepam ) ను రిపీట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం వంటలక్క ఈజ్ బ్యాక్ అంటూ కొంతమంది చెబుతున్నారు.కార్తీకదీపం2 సీరియల్ ను ఎన్నేళ్లు సాగదీస్తారో అంటూ మరి కొందరు చెబుతుండటం గమనార్హం.

ఈ సీరియల్ రీమేక్ అయ్యి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సీరియల్ తెరకెక్కుతోందని తెలుస్తోంది.

కార్తీకదీపం సీజన్2 ను 7 : 30 గంటలకే ప్రసారం చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీజన్2 లో కూడా దీపకు కష్టాలు తప్పవా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

త్వరలో ఈ సీరియల్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వస్తున్నాయి.ఈ సీరియల్ కు అదిరిపోయే రేటింగ్స్ వస్తాయని స్టార్ మా వర్గాలు భావిస్తున్నాయి.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?