కార్తీక మాసం లోని సోమవారం రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసా..?

కార్తీక మాసం( Karthika Masam )లో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని ప్రజల నమ్ముతారు.

శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తిక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.

అలాగే సోమవారం చేసే స్నానం, పూజా, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం పొందుతారని నమ్ముతారు.

అయితే కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది.

శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం( Koti Somavaram ) రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు.

"""/"/ అలాగే శివాలయ సందర్శనం( Lord Shiva Tempple ), అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.

ఈ నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు.

కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం( Fasting ) ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

"""/"/ అందుకే రేపు కోటి సోమవారం కాబట్టి ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సొంతం చేసుకుంటారు.

కార్తిక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి.

సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనీకి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి.

ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని( Om Namah Shivayya ) పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.

ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసినా పుణ్య ఫలితం దక్కుతుంది.

షాకింగ్ వీడియో: యూఎస్ మహిళను కొరికేసిన సొరచేప.. నీరు ఎర్రగా మారింది..!