కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే..!

సంవత్సరంలో ఎంతో పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి.ఈ కార్తీక మాసంలో ప్రతి రోజూ ఒక వేడుకగా నిర్వహిస్తారు.

ఈ నెలంతా దీపాల వెలుగులో, భక్తిశ్రద్ధలతో ఆ శివకేశవులకు ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరిపిస్తారు.ఈ నెలలో వచ్చే కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమికి కలిగిన ఈ 15వ రోజును కార్తీక పౌర్ణమి గా జరుపుకుంటారు.

ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.ఈరోజు శివాలయంలో శివునికి రుద్రాభిషేకం, దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఒక పర్వదినంగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం ప్రజలను పట్టి పీడిస్తున్న తిరకాసురుడు అనే రాక్షసున్ని కార్తికేయుడు పౌర్ణమి రోజున సంహరించడం వల్ల సంతోషంలో ప్రజలు దీపాలను వెలిగించి ఒక వేడుకగా జరుపుకుంటారు.

అందువల్ల కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా పిలుస్తారు.అంతేకాకుండా ఈరోజు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతమైన సందర్భంలో ఆ పరమ శివుడు తాండవం చేసాడని మన పురాణాలు చెబుతున్నాయి.

అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి అటు శివుడికి, విష్ణువు కు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఈ కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలలో పాల్గొని సంధ్యా సమయంలో అవు నెయ్యితో దీపం వెలిగించి నదులలో, లేదా కాలువలో దీపాలను వదిలి ఆ నదీ జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించి పూజించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.

అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత ఉపవాస దీక్షలను విరమించాలి.అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యపు పిండితో చేసిన దీపాలను, లేదా ఉసిరి దీపాలను శివాలయాలలో వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి.

ఇంతటి పవిత్రమైన రోజున దీప దానం, సాలగ్రామ దానం, వంటి దానధర్మాలు చేయడం వల్ల శుభపరిణామాలు ఏర్పడతాయని ప్రగాఢ విశ్వాసం.ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడం చాలా శ్రేష్టం.

క్లిక్ పూర్తిగా చదవండి

గాడ్ ఫాదర్ సినిమాలో పవన్ కళ్యాణ్.. సినిమా హిట్టు గ్యారెంటీనా?

ఆ గుడి లోని గర్భగుడి నిండా డబ్బుల కట్టలే... ఎక్కడంటే...?

క్రుష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్

ఆ గుడి లోని గర్భగుడి నిండా డబ్బుల కట్టలే... ఎక్కడంటే...?

ఏపీలో ఎన్నికల ఫీవర్.. వేడెక్కిన ఏపీ రాజకీయాలు

వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

నోరా ఫతేహి తన అందాలతో సందడి చేస్తోంది