నేటి నుంచి ప్రారంభమైన కార్తీక మాసం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..!

మన హిందూ తెలుగు నెలల ప్రకారం కార్తీకమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ కార్తీకమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

కార్తీకమాసం నేటి నుంచి ప్రారంభమై డిసెంబర్ 4 వరుకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

ఈ క్రమంలోనే ఈ నెలరోజులు భక్తులు పెద్దఎత్తున శైవ క్షేత్రాలను దర్శించి ప్రత్యేక అభిషేకాలు పూజలు పాల్గొంటూ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే పలు శైవ ఆలయాలలో కార్తీక మాస ఏర్పాట్లు మొదలయ్యాయి.

ముఖ్యంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా పాతాళగంగలోని భక్తుల స్నానాలకు కార్తీక దీపాలను వెలిగించడం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇలా కార్తీక మాసం ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో, కొన్ని నియమ నిష్టలు పాటిస్తూ పూజలు చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

"""/"/ ఇక కార్తీక మాసంలో కొందరు భక్తులు నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతారు.

అలాగే ఈ నెల మొత్తం ఎలాంటి మాంసాహారాన్ని ముట్టకుండా కేవలం భక్తి శ్రద్ధలతో ఈ నెల మొత్తం శివనామస్మరణతో స్వామివారి సేవలో నిమగ్నమవుతారు.

అయితే ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో పాటు మన స్థాయి కొద్ది దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.

అలాగే కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడు ఆలయాన్ని సందర్శించి బిల్వదళాలతో స్వామివారికి పూజ చేయడం వల్ల ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ప్రభుత్వ పాఠశాలలో చదివి 593 మార్కులు.. త్రివేణి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!