కార్తీక మాసంలో ఈ క్షేత్రాలను దర్శించుకున్నారా.. భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమంటూ?

ఏడాదిలో ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.కార్తీక మాసంలో( Karthika Masam ) కార్తీక సోమవారాలు మరింత ప్రత్యేకం కాగా కార్తీక మాసంలో నవనంది క్షేత్రాలను దర్శించుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు.

నంద్యాల జిల్లాలోని మహానందితో పాటు మహానంది( Mahanandi ) చుట్టూ 16 కిలోమీటర్ల పరిధిలో ఈ నవనంది క్షేత్రాలు వెలిశాయి.

ఈ ఆలయాలను దర్శించుకుంటే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమంటూ పండితులు చెబుతున్నారు.సోమవారం రోజున లేదా కార్తీక పౌర్ణమి రోజున గుడిపాడ గడ్డలో ఉన్న భ్రమరాంబ దేవిని,( Bhramarambha Devi ) మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఉన్న సాక్షిగణపతిని,( Sakshi Ganapathi ) దర్శించుకుని యాత్ర ప్రారంభిస్తే మంచిది.

ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, వినాయక నంది, గరుడ నంది, సూర్య నంది క్షేత్రాలను దర్శించుకుని చివరగా గుడిపాడిగడ్డలో ఉన్న మల్లిఖార్జునస్వామిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి.

"""/" / ప్రథమ నంది శామకాల్వ గట్టున ఉండగా మహానంది క్షేత్రంలో శివుడు గోవుపాద రూపంలో వెలిశారు.

మహానంది ఆలయాల్లో అంతర్భాగంగా వినయక నంది( Vinayaka Nandi ) నిర్మితమైంది.మహానంది క్షేత్రంలో ఆలయానికి పడమటి దిశలో గరుడ నంది ఉంది.

మహానంది నంద్యాల ప్రధాన రహదారిలో తమడపల్లెకు దక్షిణం వైపున సూర్యనంది( Surya Nandi ) ఉంది.

బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వలో శివనంది ఉంది. """/" / నల్లమల అడవిలో కృష్ణనంది క్షేత్రం ఉండగా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రాణంగణంలో నాగనంది ఉంది.

ఈ ఆలయాలను జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

కార్తీకమాసంలో పూజలు చేసేవాళ్లు నియమనిష్టలను పాటిస్తూ పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ గుడులకు వెళ్లడం సాధ్యం కాకపోతే దగ్గర్లోని శివాలయంలో పూజలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో దొంగ ఓటు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?