జబర్దస్త్ లో కార్తీకదీపం సిస్టర్స్ ఎంట్రీ.. పంచ్ లతో ఆకట్టుకున్న సహృద, కృతిక!

తెలుగు బుల్లితెరపేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న విషయం మనందరికి తెలిసిందే.

అయితే మొదట్లో కార్తీకదీపం సీరియల్ ను బాగా ఆదరించిన ప్రేక్షకులు ఎప్పుడైతే కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ముగిసాయో అప్పటినుంచి చాలామంది సీరియల్ ని చూడడమే మానేశారు.

డాక్టర్ బాబు, దీప, మోనిత వీళ్ళు ఎప్పుడైతే వెళ్లిపోయారో అప్పుడే కార్తీకదీపం సీరియల్ కి కల తప్పింది.

కార్తీకదీపం పిల్లలను పెద్దవారికి నెక్స్ట్ జనరేషన్ అంటూ సీరియల్ ని నడుపుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సీరియల్ లో చిన్నప్పటి హిమ పాత్రలో నటించిన సహృద, అలాగే సౌర్య పాత్రలో నటించిన బేబీ కృతిక గురించి మనందరికీ తెలిసిందే.

ఇక వీరి స్థానంలో ప్రస్తుతం హిమగా కీర్తి భట్, శౌర్యగా అమూల్య గౌడ లు ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు వీళ్ల చుట్టూనే కథ నడుస్తోంది.కాగా హిమ శౌర్య చిన్నప్పటి పాత్రలో నటించిన సహృద, క్రితిక ఇద్దరూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.

చిన్న వయసులోనే అద్భుతంగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ఇక వీరిద్దరూ స్క్రీన్ పై కనిపించారు అంటే వామ్మో వీళ్ళు ఏడిపించేస్తారా బాబు అనే విధంగా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.

"""/"/ ఇదిలా ఉంటే సహృద, క్రితిక తాజాగా జబర్దస్త్‌ కామెడీ షోలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

మహిష్మతి సామ్రాజ్యపు మహరాణులు శివగామి సిస్టర్ అనేపించేట్టుగా చాలా హుందాగా అనిపించారు.వచ్చీరావడంతోనే అనసూయపై పంచ్‌లు వేసేసింది సౌర్య.

పక్క రాజ్యపు మహరాణి ఎలా ఉంది.ఆమె ఏమైనా చేస్తున్నారా? ఖాళీగానే ఉన్నారా? అని పంచ్ వేసింది.

దీంతో నూకరాజు.ఆమె ఖాళీగా ఉండటం ఏంటి తల్లీ.

మన రాజ్యంలో కామెడీ షో చేస్తూ పక్క రాజ్యంలో ప్రోగ్రామ్‌ చేస్తూ.రాత్రి ఈవెంట్ చేస్తూ పొద్దున్న ఐదింటికి రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మగారూ అంటూ అనసూయ బిజీ షెడ్యూల్ లీక్‌లు వరుసగా చెప్పుకొచ్చాడు నూకరాజు.

మొత్తానికైతే కార్తీకదీపం సిస్టర్స్‌కి జబర్దస్త్‌లో గ్రాండ్ ఎంట్రీ లభించింది.మరి ఈ ఒక్క ఎపిసోడ్‌కి మాత్రమే ఉంటారో లేదంటే కంటిన్యూ అవుతారో చూడాలి మరి.

బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?