కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.

ఇక ఈ సీరియల్ వల్ల స్టార్ మా రేటింగ్ విషయంలో దూసుకుపోతుంది.ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంది.

ఇక ఈ సీరియల్లో రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.ఇక ఈ సీరియల్ ని ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా తిలకిస్తున్నారు.

ఇక సీరియల్ నిర్వాహకులు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్లు రోజుకో ట్విస్ట్ ఇస్తూ కార్తీక్ దీపాల మధ్య అనుబంధాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.

ఇక ఈ సీరియల్ మంచి రసపట్టు మీద ఉన్నట్లు ప్రేక్షకుల మాటలను బట్టి తెలుస్తుంది.

దీప చనిపోతుంది అన్న వార్త వారి గుండెలను భాదిస్తుండగా మున్ముందు సీరియల్ లో ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే ఈ సీరియల్ లో నటించే నటీనటుల పారితోషకం ఎలా ఉంటుంది అంటే ప్రేక్షకులు వీరికి భారీ రెమ్యూనరేషన్ ఉంటుందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

కార్తీక్ దీపాల పాత్రను పోషించే వారికి పారితోషికం భారీగా ఉంటుందని వారు అంచనాకు రాగా ఈ సీరియల్ లో వారి కూతుర్లు గా నటిస్తున్న శౌర్య, హిమ ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో కూడా వారు అంచనా వేస్తున్నారు.

మామూలుగా సీరియల్స్ లో రోజువారి పారితోషికం అందుకుంటారు ఆర్టిస్టులు అలా వీరిద్దరి పారితోషికం రోజుకు లక్షకు పైగానే ఉంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నతనంలోనే ఈ రేంజ్ లో సంపాదిస్తున్న ఇద్దరు పాపలు భవిష్యత్తులో ఇంకెన్ని మంచి మంచి అవకాశాలు పొందుతారో చూడాలి మరి.

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లుగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు.. ఎవరంటే?