గేమ్ ఛేంజర్.. అది నా విజన్ కాదు.. కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

రామ్ చరణ్ ,శంకర్ ( Ram Charan, Shankar )కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju ) తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కార్తీక్ సుబ్బరాజ్ తర్వాత మూవీ సూర్య హీరోగా తెరకెక్కుతోంది.సూర్య 44వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే( Pooja Hegde ) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో సూర్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.అదే సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా గురించి కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీ రాశా కానీ ఆ సినిమా పక్కా శంకర్ విజన్ తో తెరకెక్కుతోందని తెలిపారు.

నా కథను ఆయన తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానికి గేమ్ ఛేంజర్ నిదర్శనమని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చారు.

"""/" / శంకర్ సినిమాల ప్రభావంతోనే నేను డైరెక్టర్ గా మారానని ఆయన కామెంట్లు చేశారు.

నా కథతో శంకర్ సినిమాను తెరకెక్కించడం మరిచిపోలేని జ్ఞాపకం అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.

తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ బాగుందని ఆయన తెలిపారు.కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్లు గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

"""/" / కార్తీక్ సుబ్బరాజు భవిష్యత్తులో టాలీవుడ్ హీరోలతో ఎన్ని సినిమాలను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.

కార్తీక్ సుబ్బరాజు రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.కార్తీక్ సుబ్బరాజు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని ఈ సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య