ఆటోలో ప్రయాణం.. అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నా.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

సినిమా బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీల నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావడం సులువైన విషయం కాదు.

అయితే బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ఆర్యన్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.

సత్యప్రేమ్ కి కథ( SatyaPrem Ki Katha ) సినిమాతో సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం చందు ఛాంపియన్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan ) నో ఫిల్టర్ విత్ నేహా నే ప్రోగ్రామ్ లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఈ కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ ఈ సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.

కెరీర్ స్టార్టింగ్ లో నేను పలు యాడ్స్ లో నటించానని ఆయన అన్నారు.

కొన్నిసార్లు కేవలం ప్లకార్డులు పట్టుకుని కెమెరా మూందు నిలబడేవాడినని కార్తీక్ ఆర్యన్ కామెంట్లు చేయడం గమనార్హం.

ఎన్నో అడిషన్స్ లో పాల్గొన్నా ప్రయోజనం లేకుండా పోయిందని కార్తీక్ ఆర్యన్ అన్నారు.

"""/" / బాధగా అనిపించి నేను ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సోను కే టిటు కి స్వీటీ ( Sonu Ke Titu Ki Sweet )రిలీజ్ కు ముందు నేనెవరో ఎవరికీ తెలియదని ఆయన కామెంట్లు చేశారు.

నేను ఉన్నానని కూడా ఎవరూ గుర్తించలేదని కార్తీక్ ఆర్యన్ పేర్కొన్నారు.అవార్డుల ఫంక్షన్ కు వెళ్లడానికి కారు లేక ఆటోలో వెళ్లేవాడినని ఆయన తెలిపారు.

మొదట నటించిన నాలుగు సినిమాల వరకు ఇదే పరిస్థితి అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశానని నాకు కార్లు అంటే ఇష్టమని నా దగ్గర ఒక్క వాహనం కూడా లేని సమయంలో చాలా కార్లు కొనాలని నిర్ణయం తీసుకున్నానని కార్తీక్ ఆర్యన్ పేర్కొన్నారు.

కార్తీక్ ఆర్యన్ సినీ కెరీర్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Style="height: 10px;overflow: Hidden;" .

నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!