రెండోసారి తండ్రి అవుతున్న కార్తీ

తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

తన సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపుతూ తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు కార్తీ.

ఇక కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఆయన నటించే ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు.

ఇక కార్తీ నటించిన ఖైదీ చిత్రం తమిళం కంటే కూడా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక వ్యక్తిగతంగా కార్తీ ఫ్యామిలీ గురించి ఆయన అభిమానులు ఎక్కువగా ఆరా తీయరు.

ఎందుకంటే సూర్య తమ్ముడిగా అభిమానులకు సుపరిచితుడైన కార్తీ గురించి వారికి ఇప్పటికే పూర్తిగా తెలుసు కాబట్టి.

ఇక కార్తీ తాజాగా రెండోసారి తండ్రి కాబోతున్నాడట.తన భార్య రంజనీ ప్రస్తుతం గర్భంతో ఉందని, త్వరలోనే ఈ జంట తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే తన భార్య డెలివరీ సమయం దగ్గరపడటంతో ఆమెతో పాటు తన మామగారి ఇంట్లో కార్తీ ఉంటున్నాడట.

2011లో రంజనీని వివాహమాడిన కార్తీ, 2013లో ఈ జంటకు ఓ అమ్మాయి పుట్టింది.

ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం ఈ జంట ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నారు.ఇక సినిమాల పరంగా కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

అటు స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్ర షూటింగ్‌లో అతిత్వరలో జాయిన్ కానున్నాడు ఈ హీరో.

మరి ఈసారి కార్తీకి పుట్టబోయేది ఆడబిడ్డా లేక మగబిడ్డా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

10 రూపాయల టికెట్ కొని పుష్ప ది రూల్ చూశా.. నటి సంయుక్త షాకింగ్ కామెంట్స్ వైరల్!