కార్తీ కెరీర్ లోనే బెస్ట్ డీల్.. రికార్డ్ ధరకు 'జపాన్' ఓటిటి రైట్స్!
TeluguStop.com
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్.
కార్తీ చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి.
అందుకే కార్తీకి తెలుగులో కూడా మార్కెట్ ఉంది.ఇక కార్తీ నాగార్జున తో కలిసి ఊపిరి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.
అందుకే ఈయనను తెలుగు హీరోలానే భావించి ఆయన సినిమాలను ఆదరిస్తారు.ఇక ఈ మద్యే పొన్నియన్ సెల్వన్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత కార్తీ 'సర్దార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
"""/"/
ఇక ఈ సినిమాతో మంచి విజయం అందుకుని జోరు మీద ఉన్న కార్తీ వెంటనే మరో సినిమా ప్రకటించాడు.
ఎప్పటి లాగానే కార్తీ విభిన్నమైన సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు.యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ తో ఈయన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
''జపాన్'' అనే టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేసారు. """/"/
ఈ సినిమాలో కార్తీ జోడీగా అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ హక్కుల డీల్ ముగిసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టు అది కూడా కార్తీ కెరీర్ లోనే అత్యధిక మొత్తంతో ఈ డీల్ ముగిసినట్టు సమాచారం.
ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.
పిల్లిని చంపి వండుకు తిన్న యూఎస్ మహిళ.. ఆమెకు పడిన శిక్ష తెలిస్తే..