బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

గత సీజన్ల స్థాయిలో కాకపోయినా బిగ్ బాస్ సీజన్ 5 కూడా ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు సీజన్ 5లో పాల్గొన్నారని కామెంట్లు వినిపిస్తున్నా రవి, లోబో, షణ్ముఖ్, ప్రియ వల్ల ఎక్కువమంది ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు.

తొలి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ కాగా రెండో వారం నామినేషన్ కు ఏడుగురు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు.

కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఉమాదేవి తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో బూతులతో రెచ్చిపోయారు.

ఆమె చేసిన కామెంట్లు విని అవాక్కవడం హౌస్ మేట్స్ వంతైంది.ఈ వారం ఎలిమినేషన్ కు ప్రియ, అనీ మాస్టర్, ప్రియాంక, లోబో, ఆర్జే కాజల్, కార్తీకదీపం ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ నామినేట్ అయ్యారు.

ఉమాదేవి, కాజల్, నటరాజ్ మాస్టర్ వీక్ కెంటెస్టెంట్లు కాగా ఈ వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి ఇష్టానుసారం మాట్లాడటం ఆమెకు మైనస్ గా మారింది.

"""/"/ అయితే గత వారం జశ్వంత్ పడాల ఎలిమినేట్ అవుతాడని భావిస్తే బిగ్ బాస్ సరయును ఎలిమినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో సరయుకు లవ్ ట్రాక్ లేకపోవడం వల్లే ఆమెను ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రేక్షకుల్లో ఉమాదేవిపై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది. """/"/ హౌస్ లో కొందరు కంటెస్టెంట్లపై ఇష్టానుసారం చేస్తున్న కామెంట్లు ఆమెకు మైనస్ గా మారుతున్నాయి.

మరోవైపు బిగ్ బాస్ షో ఏ స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

లాంఛింగ్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డు స్థాయిలో రేటింగ్స్ వస్తాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బోండా ఉమ ఎన్నికల అఫిడవిట్ తప్పులతడక..: వెల్లంపల్లి