వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. నడిరోడ్డుపై లాంగ్ జంప్ చేస్తున్న దెయ్యాలు..

నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే( Telugu States ) కాదు దేశంలో అనేక ప్రాంతాలలో రోడ్లు రహదారులు గుంతలు గుంతలుగా దర్శనమిస్తూ ఉంటాయి.

ఇలా రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అంతేకాదు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేక ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలా రోడ్లు సరిగా లేకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే.నాసిరకం పనులని కొందరి అంచనా.

అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా రోడ్లపై పలు రకాల విమర్శలు తలెత్తుతున్న కూడా అందుకు సంబంధిత అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు.

"""/" / అయితే., ఇటీవల జరిగిన కృష్ణాష్టమి( Krishna Janmashtami ) వేడుకలలో భాగంగా రోడ్ల పరిస్థితిని తెలుపుతూ.

చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉడిపిలోని ఓట్ల ఉత్సవం సందర్భంగా గుంతలతో నిండిన రోడ్ల మధ్య యమధర్మరాజు, చిత్రగుప్తుల వేషధారణలో ఉన్న వారు, దయ్యాలు వేషధారణలో వేసిన వారు లాంగ్ జంపు చేస్తూ పోటీలను ఏర్పాటు చేశారు.

వారు అందరూ ఈ ప్రదర్శనలో రోడ్ల పరిస్థితుల గురించి వివరించారు.ఇక ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"""/" / ఇక అలాగే ఈ వీడియోలో గుంతలు పడిన రోడ్డుపై నిలబడి దెయ్యం వేషధారణ చేసేవారి కోసం యమరాజు, చిత్రగుప్త వేషధారులు లాంగ్ జంప్ చేయించడం మనం చూడవచ్చు.

ఈ వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.యమధర్మరాజు కర్ణాటక( Karnataka)లోని ఉడిపిలో దెయ్యాల కోసం లాంగ్ జంప్ పోటీని నిర్వహించారు అంటూ రాసుకొచ్చాడు.

రైలు ప్రయాణాలలో జరభద్రం సుమీ.. లేకపోతే సమస్యలు తప్పవు!(వీడియో)