అసెంబ్లీ స్పీకర్ గా విశ్వేశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక

కర్ణాటక లో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో యడ్యూరప్ప కర్ణాటక సీఎం గా ప్రమాణస్వీకారం చేయడం,ఆతరువాత అసెంబ్లీ లో బల పరీక్ష లో నెగ్గడం తో ఇక కర్ణాటక లో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లు అయింది.

ఈ క్రమంలో ఈ రోజు అసెంబ్లీ నూతన స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తుంది.

గడువు ముగిసే సరికి విశ్వేశ్వర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, మరెవరూ కూడా తమ నామినేషన్ లు దాఖలు చేయకపోవడం తో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

గత కొద్దీ రోజులుగా కర్ణాటక లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్ష లో విఫలమవడం తో ఇక తరువాత అత్యధిక ఓట్లు సంపాదించిన పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

"""/"/ విశ్వాస పరీక్షలో యడియూరప్ప విజయం సాధించిన వెంటనే రమేష్‌ కుమార్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు.

రమేష్ స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకోవడం తో స్పీకర్ గా విశ్వేశ్వర హెగ్డే నామినేషన్ దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

ఎన్టీఆర్ సినిమాలలో హృతిక్ రోషన్ కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా…అలా ఫీలయ్యారా?