క్లైమాక్స్ కు కర్నాటక రాజకీయం.. !
TeluguStop.com
తిండి దొరకక ఒకడు భాదపడుతుంటే తిన్నది అరగక మరొకడు భాడపడిట్లు అయింది ప్రస్తుతం కాంగ్రెస్ ( Congress )పరిస్థితి.
కర్నాటక ఎన్నికల్లో ఓడిపోయామని బిజెపి, జెడిఎస్ పార్టీలు భాదపడుతుంటే.కాంగ్రెస్ పార్టీమో గెలిచి కూడా ఆపసోపాలు పడుతోంది.
ఎన్నికల ఫలితాలు వేడివడి నాలుగు రోజులవుతున్న ఇంతవరకు సిఎం ఎవరో తేల్చుకోలేని పరిస్థితి.
కర్నాటక సిఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్( D K Shivakumar ) గట్టిగా పోటీపడుతున్నారు.
ఒకరికి పదవి కట్టబెడితే మరొకరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొక తప్పదని భావిస్తున్న అధిష్టానం ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటుంది.
"""/" /
గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, అవినీతి రహితుడిగా గుర్తింపు ఉండడంతో సిద్దిరామయ్యనే సిఎం చేయాలని కాంగ్రెస్ లోని మెజారిటీ నేతలు కోరుకుంటున్నారు.
అయితే ఏ ఎన్నికల్లో పార్టీ తనవాళ్లే గెలిచిందని, 135 ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడ్డానని అందుకే సిఎం పదవి తనకే దక్కలని భీష్మించుకు కూర్చున్నారు.
ఇస్తే సిఎం పదవి ఇవ్వని లేకపోతే ఎమ్మెల్యేగానే ఉండనివ్వండి అంటూ మొండివైఖరి తో ఉననృ డీకే శివకుమార్.
ఇప్పటికే అటు సిద్దిరామయ్యతోనూ, ఇటు డీకే శివకుమార్ తోను విడివిడిగా చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ నేడు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పూర్తి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
"""/" / అయితే మెజారిటీ ఎమ్మేల్యేలు సిద్దిరామయ్యనే సిఎంగా కోరుకుంటున్నప్పటికి డీకే శివకుమార్ ఎందుకు అంతా పట్టుదలగా ఉన్నారనే దానికి కారణం కూడా లేకపోలేదు.
సిద్దిరామయ్య కు సిఎం పదవి అప్పగిస్తే డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ఉపముఖ్యమంత్రి పదవికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం ఉండదు.గతంలో రాజస్తాన్ లోనూ అశోక్ గెహ్లాట్( Ashok Gehlot ), సచిన్ పైలెట్ మద్య ఇదే రీతిలో సిఎం పదవిపై ఫైట్ నడవగా.
అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి సచిన్ పైలెట్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.
అందుకే ప్రస్తుతం కర్నాటకలో అలా జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే డీకే శివకుమార్ ఇస్తే సిఎం పదవి ఇవ్వండి లేదంటే పదవే వద్దని చెబుతున్నారు.
దాంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!