కర్ణాటక పాలిటిక్స్ : పవన్ కళ్యాణ్ పై బీజేపీ ఆశలు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్( Karnataka Assembly Election ) జరగబోతోంది.

దీంతో అన్ని ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ , బిజెపిలు ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోది, అమిత్ షా వంటి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

"""/" / ఇక కాంగ్రెస్ తరపున ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా సర్వే రిపోర్టులు అందడంతో,  బిజెపి ఈ విషయంలో టెన్షన్ పడుతోంది.

దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. """/" / ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండడం,  వారి ఓట్లు కీలకంగా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల లోని కీలక నాయకులను ప్రచారంలోకి దించింది.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా రంగంలోకి దించితే ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని బిజెపి ఆశలు పెట్టుకుంది.

ముఖ్యంగా బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, కోలారు, చిక్క బళ్ళాపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రచారం చేయించాలని బిజెపి కీలక నేతలకు కొంతమంది భావిస్తున్నారట.

"""/" / ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అనే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి కాంగ్రెస్ ( BJP )మధ్య పోటీ తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో , నియోజకవర్గాల్లో లక్షలాది మంది తెలుగు ఓటర్లు ఉండడంతో,  సినిమా రంగానికి చెందిన వారితో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే గెలుపునకు ఎటువంటి డోఖా ఉండదనే అభిప్రాయం బిజెపీ నేతల్లో ఉందట.

అందుకే పవన్ కళ్యాణ్ ను ఏదో రకంగా ఒప్పించి ఎన్నికల ప్రచారంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయనను ఒప్పించే పనిలో బిజేపి నేతలు ఉన్నారట.

నటుడు చలపతిరావు 1200 సినిమాలు చేయడం వెనక అంత కష్టం దాగుందా?