సమాధిలో ఉన్న శవాలకు కూడా భద్రత లేదు.. ఏం మూఢ నమ్మకాలురా బాబోయ్‌

కంప్యూటర్‌ యుగంలో మనిషి దూసుకు వెళ్తున్నాడు, స్మార్ట్‌ యుగంలో 4జీ స్పీడ్‌తో ప్రపంచంతో పోటీ పడాల్సిన కొందరు మూడ నమ్మకాలతో ఇంకా వెనుకబడి పోతున్నారు.

అత్యంత ప్రాచీనమైన పద్దతిలో శక్తులు సంపాదించేందుకు, మూడ నమ్మకాలతో మనుషుల ప్రాణాలను తీస్తూనే ఉన్నారు.

మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో కొన్ని క్షుద్ర పూజలు చేయించడం, కష్టపడకుండానే డబ్బు కలిసి వస్తుందని గుడ్డిగా బలి ఇవ్వడం వంటివి కొందరు చేస్తూనే ఉన్నారు.

ఈ కాలంలో కూడా ఇంకా ఈ పూజలు, బలులు జరుగుతున్నాయి అంటే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.

ప్రపంచ దేశాలకు ధీటుగా మనదేశం ఎదుగుతున్న సమయంలో ఇలాంటి మూడ నమ్మకాలను పాటిస్తూ మన దేశాన్ని మనమే పది సంవత్సరాల వెనక్కు నెట్టుతున్నాం.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం మన దేశంలో ఉన్న మూడ నమ్మకాలకు అందం పడుతోంది.

దొడ్డబళ్లాపురం ఏరియాలోని భైరనహళ్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల అరసయ్య జనవరి 13న గుండెపోటుతో మరణించాడు.

ఆయన చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు పద్దతి ప్రకారం భూమిలో ఖననం చేశారు.

ఆయన కర్మఖాండ మరియు ఇతర కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేశారు.గ్రామం శివారు ప్రాంతంలో అతడి మృత దేహంను ఖననం చేయడం జరిగింది.

తాజాగా ఆయనను ఎక్కడైతే ఖననం చేశారో అక్కడే తవ్వకాలు జరిపారు.కొందరు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు విచారణ జరపాలని కోరారు.

పోలీసులు స్మశానంకు వెళ్లి చూడగా అక్కడ చనిపోయిన అరసయ్య తలకాయ మాత్రమే తీసుకు వెళ్లారని, మిగిలిన బాడీ అంతా అలాగే ఉంచారని తేలింది.

దాంతో క్షుద్ర పూజల కోసం ఇలా చేశారని, ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

అరసయ్య తలకాయ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో శవాలకు సంబంధించిన వివిధ శరీర భాగాలను అర్థరాత్రి సమయంలో స్మశానంకు వచ్చి తవ్వినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఎప్పటికప్పుడు తవ్విన మట్టిని పూడ్చి వేయడం వల్ల ఎప్పుడు అనుమానం రాలేదు.

కాని ఈసారి మాత్రం తవ్వకాలు జరిపిన వాడు మట్టిని పూడ్చి పెట్టక పోవడం వల్ల విషయం బయట పడింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మొండెం వరకు బయట ఉండటంతో పోలీసుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆ మొండెంను మళ్లీ పూడ్చి పెట్టారు.

ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలు మొండెం వరకే పూడ్చి పెట్టడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం కలిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.

అయితే అలాంటి భయం ఏమీ లేదని, ప్రజలకు పోలీసులు రెవిన్యూ శాఖ వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

2020 వస్తున్నా ఇంకా ఇలాంటి భయాలు, క్షుద్ర పూజలు చేయడం కొందరికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా గ్రామాల్లో చాలా కామన్‌గా ఇవి జరుగుతున్నాయి.

వాటిని ఇప్పట్లో ఆపే వారే లేరనిపిస్తుంది.

వీడియో వైరల్: పబ్లిక్ లో తెగ కొట్టేసుకున్న మహిళలు..