కర్ణాటక ప్రయోగం పై టి. కాంగ్రెస్ ఆసక్తి ! 

ఎట్టి పరిస్థితుల్లో అయినా తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఉంది.

ఇప్పటికే పాదయాత్రలు, ఉద్యమాలు ఆందోళనలు సభలు , సమావేశాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ప్రజల ఆదరభిమానాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పోరాటాలు చేస్తోంది.మరోవైపు చూస్తే బిజెపి( BJP ) తెలంగాణలో గతంతో పోలిస్తే బాగా బలం పెంచుకుంది.

అధికారంలోకి వస్తానని వ్యక్తం చేస్తుంది.కేంద్ర బీజేపీ పెద్దలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ , పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో,  కాంగ్రెస్ కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

దీనిలో భాగంగానే కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన ప్రయోగాన్ని తెలంగాణలోనూ అమలు చేసే విధంగా ఆసక్తి చూపిస్తోంది.

"""/" / ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

పొత్తుల గురించి పట్టించుకోకుండా,  సర్వేల ప్రకారం, గెలుపు ఆధారంగానే నమ్మకమైన నేతలకు టిక్కెట్లను కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించింది.

గతంలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన మాట ప్రకారం,  కర్ణాటకలో దీనిని అమలు చేశారు.

ఈ వ్యూహం సక్సెస్ అయిందనే అభిప్రాయంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది.అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా బయటకు రావడంతో,  కర్ణాటకలో చేసిన ప్రయోగాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ హై కమాండ్ ఉందట.

"""/" / ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు నేతృత్వంలో సర్వేలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

119 నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించి, త్వరలోనే అభ్యర్థుల జాబితాను సునీల్ కానుగోలు టీం, కాంగ్రెస్ హై కమాండ్ కు అందించబోతున్నారట.

దాంట్లో చిన్న చిన్న మార్పు చేర్పులు చేసి , త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారట.

"""/" / తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండడంతో, ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా,  వారు జనాల్లోకి వెళ్ళేందుకు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సమయం ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థులు తరచుగా ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లో ఉండడం ద్వారా,  ఎన్నికల సమయంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభించడంతోపాటు, కాంగ్రెస్ విజయానికి దోహదం చేస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ హై కమాండ్ ఉందట.

ఇప్పటికే తెలంగాణ కీలక నేత భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేయాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ముందస్తు గా అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?