కాంగ్రెస్ కు కర్నాటక ఎఫెక్ట్ ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ప్రస్తుతం అధికారం కోసం తెగ ఆరాటపడుతోంది.

ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకొని సౌత్ రాష్ట్రాల్లో మరింత బలపడాలని ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే కర్నాటకలో( Karnataka ) అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.తెలంగాణలో( Telangana ) కూడా అదే సీన్ రిపీట్ చేస్తే.

తిరుగుండదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది.అందుకే కర్నాటకలో ఫాలో అయిన విన్నింగ్ స్ట్రాటజీనే తెలంగాణలో కూడా ఫాలో అవుతోంది.

దాదాపు అక్కడ ప్రకటించిన హామీలనే తెలంగాణలో కూడా ప్రకటించింది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.

500 లకే గ్యాస్ సిలిండర్.ఇలా పలు హామీలను కర్నాటకలో ప్రకటించి కన్నడ ప్రజాలను ఆకర్షించి అధికారంలోకి వచ్చింది.

"""/" / తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం వెనకడుగు వేస్తోంది.

ఉచిత బస్సు ప్రయాణం( Free Bus Travel ) అమలు చేసినప్పటికీ బడ్జెట్ కొరతతో ఆ పథకం పై షరతులు విధించింది.

ఇక మిగిలిన పథకాలపై కూడా చేతులెత్తేసింది.ఇప్పుడు తెలంగాణలో అవే హామీలే ఇచ్చి అధికారంలోకి రావాలని భావిస్తోంది.

అయితే ఆల్రెడీ కర్నాటకలో హస్తం పార్టీ తీరు గమనించిన తెలంగాణ ప్రజలు ఇక్కడ హస్తం పార్టీని నమ్మే అవకాశాలు కనిపించడం లేదు.

పైగా కర్ణాటకలో సి‌ఎం పదవి( CM Post ) విషయంలో ప్రస్తుతం జరుగుతున్నా రాజకీయం కూడా టి కాంగ్రెస్ పై పడే అవకాశం కనిపిస్తోంది.

"""/" / ప్రస్తుత సి‌ఎం సిద్దిరామయ్య( CM Siddha Ramaiah ) మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్( DK Siva Kumar ) మద్య సి‌ఎం పదవి విషయంలో కోల్డ్ వార్ జరిగిన సంగతి విధితమే.

అయితే అధిష్టానం కలుగజేసుకొని చెరో రెండున్నర ఏళ్ళు సి‌ఎం పదవిలో ఉండేలా డీల్ కుదిర్చింది.

అయితే అయిదేళ్లు తానే సి‌ఎం గా ఉంటానని ఇటీవల సిద్దిరమయ్య చెప్పడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది.

ఇటు తెలంగాణలో కూడా సి‌ఎం అభ్యర్థి విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

పార్టీలోని సీనియర్ నేతలంతా సి‌ఎం అభ్యర్తి రేస్ లో ఉన్నారు.ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించిన.

ఇతరుల నుంచి పార్టీకి నష్టం జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.మొత్తానికి అటు కర్నాటకలోనూ ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ లో సేమ్ భయం సేమ్ స్ట్రాటజీలు కొనసాగుతున్నాయి.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?