గవర్నర్ కి రాజీనామా లేఖ అందించిన కర్ణాటక సీఎం బొమ్మై..!!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ( BJP ) ఓటమి చెందటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై( Baswaraj Bommai ) తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.

ఈ క్రమంలో తన రాజీనామా లేఖను గవర్నర్ ధావర్ చంద్ గేహ్లాట్ కు అందించటం జరిగింది.

మే 10వ తారీఖున జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడగా.

బీజేపీ 65 స్థానాలకు పరిమితం అయింది.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) 136 స్థానాలతో అధికారంలోకి రావడం జరిగింది.

ఊహించని విధంగా చాలా కాలం తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.

కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఆనందంగా ఉన్నారు. """/" / కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి బీజేపీ సీనియర్ నాయకులు ఎంతగానో శ్రమించారు.

ప్రధాని మోడీ ఎన్నడూ లేని రీతిలో అనేక  రోడ్ షోలలో.బహిరంగ సభలలో పాల్గొనడం జరిగింది.

అయినా గాని కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు.దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దీనంగా ఉన్న సమయంలో కర్ణాటకలో అధికారంలోకి రావడంతో.

జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో జోష్ నెలకొంది.ఇంకా ఇదే ఏడాది జరగబోయే మిగతా రాష్ట్రాల ఎన్నికలలో కూడా విజయం సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉంది.

యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!