నేడు ప్రారంభంకానున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి..!

కరీంనగర్ జిల్లాలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఇవాళ ప్రారంభంకానుంది.దాదాపు రూ.

180 కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు.

ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్ కు పర్యాటక అందాన్ని తీసుకురానుంది.కరీంనగర్ పట్టణానికి ఆరో ద్వారంగా, కొత్త పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంది.

2018లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం కాగా విదేశీ ఇంజినీరింగ్ సాంకేతికతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

ఇవాళ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు కేబుల్ బ్రిడ్జిని జాతికి అంకితం ఇవ్వనున్నారు.హైదరాబాద్ లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో దీని నిర్మాణం జరిగింది.

ఈ బ్రిడ్జి నిర్మాణంతో వరంగల్ - కరీంనగర్ మధ్య దూరం దాదాపు ఏడు కిలోమీటర్లు తగ్గనుంది.

ఈ సింపుల్ ఇంటి చిట్కాతో ఈజీగా ఫేషియల్ గ్లో పొందొచ్చు.. తెలుసా?