పవన్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.. అలాంటి పనులు చేశారా?

సినీ నటుడు జనసేన(Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల పరంగా సంచలనంగా మారారు.

ఈయన ఇటీవల పిఠాపురం(Pitapuram )నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప విజయం సాధించడంతో గతంలో ఈయన కరాటే గురువు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

  పవన్ కళ్యాణ్ మాస్టర్ షెహాని హుస్సేన్  (Shihan Hussaini) వద్ద కరాటే నేర్చుకున్నారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన 1990 సంవత్సరంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

"""/" / ఒక వ్యక్తి ఊరికే గొప్పవాడిగా పేరు తెచ్చుకోరు.ఆ పేరు వెనుక ఎంతో పట్టుదల కృషి ఉంటుంది అందుకు ఉదాహరణగా నా శిష్యులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

1990లో నేను కరాటే నేర్పటం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపటంలో బిజీగా ఉండేవాడిని.

అదే సమయంలో పవన్(Pawan) నా దగ్గరికి వచ్చి కరాటే నేర్పమని చెప్పారు.కానీ నేను బిజీగా ఉండటం వల్ల నేర్పించనని చెప్పాను.

కానీ పవన్ మాత్రం నా మాటలు వినిపించుకోకుండా అక్కడే ఉంటూ నేర్పించాలని పట్టు పట్టారు.

"""/" / ఇలా సంవత్సరం పాటు మా వద్దే ఉండేవారు ఆయన మా దగ్గర ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి లాగే గడిపేవారు కొన్నిసార్లు మాకు టీ కప్పులు తీసుకువచ్చే వారు అలాగే మేము చెప్పిన ప్రతి పని చేసేవారు ఇంకా రూమ్స్ కూడా క్లీన్ చేసేవారు అంటూ ఈ సందర్భంగా కరాటే మాస్టర్ పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి ఆయన సింప్లిసిటీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఏ పనిలోనైనా పట్టుదల కృషి ఉంటేనే ఉన్నత స్థాయిలో ఉంటారని పవన్ కళ్యాణ్ నిరూపించారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!