కరాటే కళ్యాణి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని 20 లక్షల మంది పోరాటం.. ఏం జరిగిందంటే?

కరాటే కళ్యాణి( Karate Kalyani ).ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో,అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది.

గత కొద్ది రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.అయితే మొన్నటికి మొన్న ఈమె ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( Maa Association ) నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కరాటే కళ్యాణిని అలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని వెంటనే ఆ సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలి అంటూ పలు యాదవ, హిందు సంఘాలు డిమాండ్‌ చేశాయి.

"""/" / కళ్యాణి ఎన్‌టీఆర్‌ను, సినీ పరిశ్రమను ఎప్పుడు కించపరచలేదని, శ్రీ కృష్ణునికి ఎన్‌టీఆర్‌ రూపం ఇవ్వరాదనే పోరాటం చేసిందని వారు ఆరోపించారు.

తాజాగా సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి( Yadav Rights Struggle Samithi ) జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌, రామచంద్ర యాదవ్‌, చలకాని వెంకట్‌ యాదవ్‌లు మాట్లాడుతూ.

భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సంబంధంలేని మా సస్పెండ్‌ చేయడం సరికాదని ఆరోపించారు.

బలహీనవర్గాలకు చెందిన ఒక మహిళను సస్పెండ్‌ చేయడంతో సినీ పరిశ్రమ ఒక సామాజిక వర్గానికి చెందిందిగా అర్థం అవుతుందంటూ మండిపడ్డారు.

"""/" / వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఐక్యమై పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అంతేకాకుండా త్వరలోనే ఈ విషయంపై మంచు విష్ణును కలిసి ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఈ విషయం గురించి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.తాను ఎన్‌టీఆర్‌ ను ఎప్పుడూ కించపరచలేదని, తాను కూడా ఎన్‌టీఆర్‌ అభిమానినే అని కళ్యాణి తెలిపారు.

కృష్ణుడి రూపంలో ఎన్‌టీఆర్‌ ని అని మాత్రమే కాకుండా ఎవరిని పెట్టినా ఊరుకునేది లేదు అని చెప్పుకొచ్చింది కళ్యాణి.

మొత్తానికి కరాటే కళ్యాణి మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం అన్నది రోజు రోజుకి మరింత వివాదంగా మారుతూనే ఉంది.

మరి ఈ విషయంపై మంచు విష్ణు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

ఈ పొడిని రోజుకో స్పూన్ చొప్పున తింటే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది..!