Karate Kalyani : ఆ సన్నివేశం చేసేటప్పుడు చాలా బాధపడ్డాను.. నటి కరాటే కళ్యాణి కామెంట్స్.!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి,లేడీ కమెడియన, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా కరాటే కళ్యాణి( Karate Kalyani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటించింది.
అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో( Bigg Boss Sho ) లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరాటే కళ్యాణి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఈమె ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. """/" /
బిగ్ బాస్, సీరియల్స్ ద్వారా కంటే ఈమె వివాదాస్పద వ్యాఖ్యలతో( Controversial Statements ) ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది.
ఈమె వెండితెరపై దాదాపుగా 120 కి సినిమాలలో నటించి మెప్పించింది.తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఆమె ఆరితేరారని చెప్పవచ్చు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.నేను గతంలో నటించిన పలు క్యారెక్టర్లను చూపుతూ చాలామంది నన్ను అలా మాట్లాడొద్దని అంటున్నారు.
కానీ నేను భారతీయురాలిని.( Indian ) రాముడి గురించి లేదా ఇంకెవరి గురించైనా, ఏ విషయంపై అయినా మాట్లాడే హక్కు నాకుంది.
అప్పుడు చేసిన క్యారెక్టర్లు ఇప్పుడు చేయకూడదనే సినిమాలకు దూరంగా ఉంటున్నాను. """/" /
కెరీర్ కొత్తలో సీరియళ్లలో నటించాను.
చిత్రాల్లో నటిస్తే ఫేమ్ వస్తుందని అటువైపుగా ప్రయత్నించాను.ఈ క్రమంలో వల్గారిటీ ఉన్న పాత్రలకు అంగీకరించాను.
అయితే వల్గారిటీ తక్కువ ఉంటుందన్నాకే వాటికి ఒప్పుకున్నాను.అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరి మద్దతు లేకపోవడంతో ఆ దారిలోకి వెళ్లాను.
ఒక సినిమా లో అలీ( Comedian Ali )తో నటించే సీన్లో చాలా ఇబ్బందిపడ్డాను.
ఒక సీన్ లో చీర కొంగును జార్చే సన్నివేశం చేయడానికి మనసు ఒప్పుకోలేదు.
అయితే అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యాను.నేను కాకపోతే ఇంకొకరికి ఆ పాత్ర వచ్చి ఫేమ్ అవ్వొచ్చు.
అందుకే అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది.
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!