Director Surya Kiran : సూర్యకిరణ్ మృతి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరాటే కళ్యాణి.. ఆయనకెప్పుడూ మనశ్శాంతి లేదంటూ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్య కిరణ్( Director Surya Kiran ).

టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య కిరణ్ తాజాగా అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే.

పచ్చ కామెర్ల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఈయన మృతికి అసలైన కారణాలు ఇవే అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి కరాటే కల్యాణీ.

ఆయన మృతికి ఆయన మాజీ భార్య కళ్యాణీయే( Ex Wife Kalyani ) కారణం అంటూ వివరించింది.

సూర్య కిరణ్ మరణం పట్ల కరాటే కళ్యాణి స్పందిస్తూ.అసలు సూర్య కిరణ్ గారు చనిపోవడానికి ఆయన అలవాట్లే.

"""/"/ సూర్య కిరణ్ కు మందుతాగే అలవాటుతో పాటు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంది.

వాటి వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి.రోజూ ఎక్కువగా సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం చేసే వారు.

వాటి వల్లే ఆయన చాలా కాలంగా అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధ పడుతున్నారు.

ఇక చివరికి తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయారు.అయితే ఆయన అంతగా మద్యం సేవించడానికి, సిగరెట్లు తాగడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఆ కారణాలలో ఆయన మాజీ భార్య, హీరోయిన్ కళ్యాణీ వల్లే ఆయనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి( Karate Kalyani ).

"""/"/ సూర్య కిరణ్ కు ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి చాలా డిప్రెషన్( Depression ) లోకి వెళ్లిపోయారు.

అందువల్లే తాగడం అలవాటు చేసుకున్నారు.కానీ సూర్య కిరణ్ ఇంత త్వరగా చనిపోతారని అసలు అనుకోలేదు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.

ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో చాలా మంది ఆమె కామెంట్ల పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!