సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు..
TeluguStop.com
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్న కరాటే కల్యాణి.
పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లిల దుస్తులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి.
హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలి.వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కరాటే కల్యాణి.
పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!