అదంతా శివశక్తి కుట్ర.. నన్ను చంపడానికి ప్లాన్ చేశారంటున్న కరాటే కళ్యాణి..?

కరాటే కళ్యాణి వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.కరాటే కళ్యాణి వివాదం విషయంలో రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే కరాటే కళ్యాణి ఇద్దరు అనాధ పిల్లలను పెంచుకుంటోంది అని తెలియడంతో చైల్డ్ లైన్ వెల్ఫేర్ అధికారులు కరాటే కళ్యాణి ఇంటిలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే పిల్లలను దత్తత విషయంలో తాను డీఎన్ఏ టెస్ట్ లకు అయినా సిద్ధం అని అంటోంది కళ్యాణి.

ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా కరాటే కళ్యాణి కేసులు నమోదు అవుతున్నాయి.

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్లతో వ్యాపారం చేస్తోంది అన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.

ఈ విషయాల పై స్పందించిన కరాటే కళ్యాణి ఇవన్నీ శివశక్తి అని ఒక హిందూ సంస్థ చేస్తున్న కుట్రలో భాగమే అని ఈ శ్రీకాంత్ రెడ్డిని కూడా అడ్డుపెట్టుకొని శివశక్తి ఆడిస్తోంది అని, ఈ విషయంలో చాలా మంది కుట్రదారులు ఉన్నారు అంటూ షాకింగ్ విషయాలను బయట పెట్టేసింది కరాటే కళ్యాణి.

అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డి అసలు రెడ్డే కాదు అంటూ బాంబు పేల్చేసింది.శ్రీకాంత్ గాడు బచ్చాగాడు.

వాడికి నా మీద చేతులు పెట్టి అంత సీను లేదు.వాటిని రెడ్డి అనొద్దు వాడు అసలు రెడ్డే కాదు.

చెప్పుకోవడానికి పేరు చివర్లో తగ్గించుకున్నాడు.నేను రెడ్డిని నేను పులివెందల.

అంటూ బిల్డప్ ఇస్తున్నాడు రెడ్డి అనేది పెట్టుకున్న తోక వారి ఇంటి అడ్రస్ వాళ్ళ తండ్రిని ఫుల్ వివరాలు నా దగ్గర ఉన్నాయి అంటూ కామెంట్ చేసింది.

"""/"/ శ్రీకాంత్ గాడిని ముందు పెట్టి వెనక నుండి కొంత మంది నాటకాలు ఆడిస్తున్నారు అని తెలిపింది కరాటే కళ్యాణి.

అంతేకాకుండా శివశక్తి అనే ఒక సంస్థ ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర పనులు చేయిస్తోంది.

శివశక్తి వాళ్లు ఇదంతా చేయిస్తున్నారు నేను పక్క గా చెబుతున్నాను అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.

నేను చేసిన పోరాటం వల్ల వాళ్ళ పై అనేక రకాలుగా చీటింగ్ కేసులు కూడా నమోదు అయ్యాయని, దానితో శివశక్తి సంస్థ మూత పడే అవకాశం ఉండటంతో ఏం చేయాలో తెలియక కొద్దిరోజులపాటు సైలెంట్ గా ఉంది, ఇప్పుడు వారికి ఉన్న పెద్ద పెద్ద భూస్వాముల అండ చూసుకొని నన్ను ఇన్ని కేసుల్లో ఇరికిస్తున్నారు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది కరాటే కళ్యాణి.

వైజయంతి మూవీస్ ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన స్టార్స్ వీరే !