తనతో పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు అని సంచలన విషయాలు బయటపెట్టిన కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తెలుగు చిత్రాల్లో మరియు బుల్లి తెర పై సీరియల్స్ నటించారు.

ఎక్కువగా రవితేజ సినిమాల్లో కనిపించిన ఈ నటి , కృష్ణ , మిరపకాయ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కరాటే కళ్యాణి ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో పోటీ చేసి ఈసీ మెంబర్‌గా ఎన్నికైయ్యారు.

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, తనకు తొలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ నా కెరియర్ మొదట్లో ఒక టాలీవుడ్ ప్రముఖుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

నెలకు 50 వేలు జీతం తో పాటి తనకు కావలసినవి అన్ని ఇస్తా అన్నాడు , దానికి బదులుగా అతను ఏది చెబితే అది చేయాలని అందుకు తగ్గట్లుగా బాండ్ రాయమని అడిగాడు.

నేను కుదరదని చెప్పడంతో తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అడిగాడు.ఆ తర్వాత 600 అద్దెతో మరో కొత్త ఇంటికి మారానని కళ్యాణి తెలిపింది.

ఆ నటుడు ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీ గా ఉన్నాడని కళ్యాణి తెలిపింది.

అతడు చెప్పినట్లు చేసి ఉంటే ఈ విషయాన్ని నేను ఇంత ధైర్యంగా ఇప్పుడు చెప్పేదాన్ని కాదు అని కళ్యాణి తెలిపింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / దానితో పాటు ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా కళ్యాణి నోరు విప్పింది , మన ప్రవర్తన , మాట తీరు , కట్టు బొట్టు ని బట్టే మన ఎదుటి వారు మనతో ఆ విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పింది , తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా, బయటకు వెళదామా అని అడిగేవారు.

కేవలం సరదాకే కదా బయటకు అని నేను కూడా వెళ్లేదాన్ని.అలాంటి సమయంలో వారు తన ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు.

కానీ అలాంటి పనులకి నేను ఎప్పుడు దూరంగా ఉండేదాన్ని ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చింది కేవలం టాలెంట్ ని నమ్ముకుని మాత్రమే అని కళ్యాణి తెలిపింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / మన కట్టు, బొట్టు, మాట్లాడే విధానం ద్వారానే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుందన్నారు.

ఎవరైనా మనకు ఆఫర్ ఇస్తాను రమ్మని అడుగుతారు.వారికి ముందుగానే మన అభిప్రాయాలు తెలియజేయాలి అని కరాటే కళ్యాణి పేర్కొంది.

మనకి మన పైన నమ్మకం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అని పేర్కొంది , అలాగే కళ్యాణి మాట్లాడుతూ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే తాను ఒప్పుకోనని ఆడవాళ్ళు పనిచేసే ప్రతి చోటా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నారు.

ఆరోగ్యానికి మంచిద‌ని బ్రౌన్ షుగ‌ర్ తీసుకుంటున్నారా.. అయితే మీరు పెద్ద త‌ప్పే చేస్తున్నారు!