Salman Khan : సల్మాన్ ఖాన్ నిజస్వరూపం బయటపెట్టిన కరణ్ జోహార్.. అలాంటి కామెంట్లతో?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సల్మాన్ ఖాన్.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. """/" / ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ రియల్ క్యారెక్టర్‌ అండ్ వర్క్ కమిట్‌మెంట్‌పై బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రసంశలు కురిపించాడు.

ఈ మేరకు షారుఖ్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కరణ్ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ కుచ్ కుచ్ హోతా హై ( Kuch Kuch Hota Hai )విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ మూవీలో గెస్ట్ రోల్ పోషించడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.

సినిమాలో సల్మాన్ ఎంపిక ఒక ఆసక్తికరమైన అంశం.అమన్ క్యారెక్టర్ చేయమని చాలామందిని అడిగాను.

"""/" / స్టోరీ సగం కూడా వినకుండానే రిజెక్ట్ చేశారు.దీంతో చివరగా సల్మాన్‌ను కలిశాను.

విషయం చెప్పగానే ఆయన ఒక మాట అన్నాడు.ఆత్మవిశ్వాసం ఉన్న నటుడే ఇలాంటి పాత్రలో నటించగలడు.

ఇది నేను చేస్తున్నాను అని డైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు.అప్పటి నుంచి సల్మాన్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ, గౌరవం అంటూ తెగ పొగిడేశాడు కరణ్ జోహార్.

ఇకపోతే కరణ్ జోహార్ విషయానికి వస్తే.కరణ్ జోహార్ నిర్మాతగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

తరచూ ఎదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా… ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!