ఢిల్లీ సీఎంకి కరణ్ జోహార్ ట్వీట్..!

ఢిల్లీ లో ఒమిక్రాన్ ఉదృతి రోజు రోజుకి పెరగడం వల్ల అక్కడ థియేటర్లు మూసి వేశారు.

అయితే ఈ అంశంపై కరణ్ జోహార్ ఢిల్లీలో థియేటర్లు తెరిపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది.

ఒకరు పెట్టిన కామెంట్ కు తమ స్పందన తెలియచేసే అవకాశం ఉంది.లేటెస్ట్ గా కరణ్ జోహార్ చేసిన ట్వీట్ కు నెటిజెన్లు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్న ఇలాంటి టైం లో కరణ్ జోహార్ థిఏటర్ లు తెరవమని ట్వీట్ చేయడం ప్రజలకు కోపాన్ని తెప్పించింది.

కరణ్ జోహార్ తన ట్వీట్ లో కరోనా వ్యాప్తి చెందకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ.

సోషల్ డిస్టన్స్ పాటిస్తూ థియేటర్లు నడపవచ్చు.తిరిగి థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని కోరుతూ ట్వీట్ చేశారు కరణ్ జోహార్.

అయితే ఈ ట్వీట్ నెటిజెన్లు అంటే మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి.సామాన్యులు ఇబ్బంది పడనివ్వండి అనేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.

బాలీవుడ్ వర్సెస్ సైన్స్ అంటూ కొందరు కామెంట్ చేయగా.సినిమాలని ఓటీటీలో చూడొచ్చు.

థియేటర్స్ తెరచి ప్రజల ప్రాణాలతో ఆటలాడకండి అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.

పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి సమస్య ఇదేనా.. అందుకే ఆలస్యం అవుతున్నాయా?