ఆ సినిమా వల్ల 20 కోట్లు నష్టపోయాను.. అలియాపై కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్?
TeluguStop.com
బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కరణ్ జోహార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీల విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు కరణ్ జోహార్.
ఇకపోతే గత ఏడాది కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో అలియా భట్ రణ్ బీర్ కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ పలు ఆసక్తికరవిషయాలను వెల్లడించారు.
2012లో విడుదల అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా గురించి ఈ ఇంటర్వ్యూలో స్పందించారు కరణ్ జోహార్.
"""/"/ఈ సినిమాలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని తెలిపారు కరణ్ జోహార్.
సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయినప్పటికీ ఆ సినిమా వల్ల దాదాపుగా 20 కోట్లు నష్టపోయినట్లు కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.
ఆర్థికంగా భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. """/"/
కాగా కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల వసూళ్లను రాబట్టింది.అయినప్పటికీ ఈ సినిమాపై ఖర్చు ఎక్కువ చేయడం వల్ల 20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు.
అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కంటే ఆలియా, వరుణ్,సిద్ధార్థ్ లతో కలిసి మరో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
మిగిలిన సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మించడం వల్ల నష్టం తిరిగి వచ్చింది అని చెప్పుకొచ్చారు.
బాగా ఇంటర్వ్యూలో భాగంగా కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?