కరక్కాయలగూడెం- ఉండ్రుగొండ రోడ్డు అవస్థలు చూడ తరమా…?

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రం నుండి పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ప్రమాదకరంగా మారి వాహనదారులను పరేషాన్ చేస్తున్నాయి.

మరి ముఖ్యంగా మండల కేంద్రం నుండి జాతీయ రహదారి గుండా వయా మామిళ్ళగూడెం నుండి వెళ్ళే విభలాపురం, కర్కయాలగూడెం, ఉండ్రుగొండ,నర్సింహపురం పోయే రహదారులు పూర్తిగా ధ్వంసమై,పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

ఈ రహదారి గుండా మండల కేంద్రానికి వాహనదారులు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోక మట్టి రోడ్ల కంటే హీనంగా మారాయి.

పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.అయినా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

టీసీ ప్రాంక్: వామ్మో ఇంతమంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా..??